బూర్గంపాడు మండలంలో ఇసుక మాఫియా అడ్డగోలుగా వ్యవహారం – రైతుల్లో తీవ్ర ఆందోళన

బూర్గంపాడు మండలంలో ఇసుక మాఫియా అడ్డగోలుగా వ్యవహారం – రైతుల్లో తీవ్ర ఆందోళన బూర్గంపాడు మార్చి 23(ప్రజాక్షేత్రం):బూర్గంపాడు మండల కేంద్రంలో ఇసుక మాఫియా అక్రమ కార్యకలాపాలు రోజురోజుకూ విస్తరిస్తుండడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు వ్యతిరేకిస్తున్నప్పటికీ, వారి మాటలను పట్టించుకోకుండా జేసిబి యంత్రాలతో భారీ గుంతలు తవ్వుతూ ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్నారు.ఈ అక్రమ తవ్వకాల వల్ల వ్యవసాయ భూములు నాశనమవుతున్నాయని, ముఖ్యంగా రాబోయే వర్షాకాలంలో కిన్నెరసాని వరదలతో ఈ గుంతలు మరింత ప్రమాదకరంగా మారి పొలాలు పూర్తిగా కోతకు గురయ్యే ప్రమాదం...