prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 07 March 2026, 5:12 pm Digital Edition : PRAJA KSHETRAM

లక్షల కారు.. కానీ సేవలు శూన్యం అంటూ బాధితుడి ఆవేదన

లక్షల కారు.. కానీ సేవలు శూన్యం అంటూ బాధితుడి ఆవేదన

కుషాయిగూడ, మార్చి 7(ప్రజాక్షేత్రం):లక్షల రూపాయలు ఖర్చు చేసి కారు కొనుగోలు చేసిన వినియోగదారుడికి వైబ్రెంట్ ఎంజీ షోరూం నిర్లక్ష్యం చుక్కలు చూపిస్తోంది. కుషాయిగూడలోని వైబ్రెంట్ ఎంజీ షోరూం సేవలపై ఒక బాధితుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధితుడు ఇటీవల ఎంజీ సంస్థకు చెందిన విండ్సర్ ఈవీ కారును కొనుగోలు చేశారు. అయితే కొద్ది రోజులకే కారులో అకస్మాత్ గా బ్రేక్ పడటం,సాంకేతిక లోపాలు తలెత్తడంతో వాహనాన్ని కుషాయిగూడలోని వైబ్రెంట్ ఎంజీ షోరూంకు రిపేర్ కోసం ఇచ్చారు. అయితే కారు ఇచ్చి 15 రోజులు గడిచినా ఇప్పటివరకు లోపాన్ని సరిచేయలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. కారు ఎప్పుడు బాగవుతుందో అడిగితే షోరూం సిబ్బంది స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదని, కారు పరిస్థితిపై సమాచారం కూడా అందించడం లేదని తెలిపారు. కారు లేకపోవడంతో తన రోజువారీ పనులకు తీవ్ర అంతరాయం కలుగుతోందని, మానసికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని బాధితుడు పేర్కొన్నారు. లక్షలు పెట్టి కారు కొన్నప్పటికీ సరైన సర్వీస్ అందకపోవడం బాధాకరమని చెప్పారు. తన కారును వెంటనే రిపేర్ చేసి అందించాలనీ, లేదంటే తగిన న్యాయం చేయాలని బాధితుడు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఎంజీ మోటార్స్ సంస్థ స్పందించి వినియోగదారులకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.