prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 29 March 2026, 5:13 pm Digital Edition : PRAJA KSHETRAM

వనపర్తి మీదుగా రైల్వే లైన్ మంజూరు.

వనపర్తి మీదుగా రైల్వే లైన్ మంజూరు.

  • మెంటేపల్లి పురుషోత్తం రెడ్డి హర్షం.

వనపర్తి, మార్చి 29(ప్రజాక్షేత్రం):వనపర్తి జిల్లా ప్రజల దీర్ఘకాలిక ఆశ అయిన కొత్త రైల్వే లైన్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం పట్ల బీజేపీ రాష్ట్ర నాయకులు మెంటేపల్లి పురుషోత్తం రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “దాదాపు మూడు దశాబ్దాలుగా వనపర్తి ప్రజలు ఎదురుచూస్తున్న ఈ రైల్వే లైన్‌కు అనుమతులు రావడం చాలా సంతోషకరం. ఇది ప్రాంత అభివృద్ధికి కీలక మలుపు అవుతుంది. ప్రజల రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు, వాణిజ్య, ఆర్థిక రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయి” అని అన్నారు. అలాగే, పార్లమెంటులో రైల్వే బడ్జెట్ సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ఈ ప్రాజెక్ట్ సాధనలో కృషి చేసిన మాజీ ఎంపీ పోతుగంటి రాములు, ప్రస్తుత మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణమ్మ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. “వనపర్తి నియోజకవర్గ ప్రజల కల నెరవేరబోతుండటం చాలా ఆనందంగా ఉంది. ఈ రైల్వే లైన్ త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను” అని మెంటేపల్లి పురుషోత్తం రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా వనపర్తి ప్రాంతానికి అభివృద్ధి వేగవంతం అవుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.