prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 15 March 2026, 4:46 am Digital Edition : PRAJA KSHETRAM

శంకర్ పల్లి నూతన సిఐని మర్యాదపూర్వకంగా కలిసిన బుల్కపూర్ యువకులు

శంకర్ పల్లి నూతన సిఐని మర్యాదపూర్వకంగా కలిసిన బుల్కపూర్ యువకులు

శంకర్ పల్లి మార్చ్ 14(ప్రజాక్షేత్రం )శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా మీర్ ముదస్సర్ అలీ బాధ్యతలు స్వికరించారు. ఈ సందర్బంగా బుల్కపూర్ ప్రాంతానికి చెందిన శేఖర్, మాణిక్యం,అనిల్,శేఖర్, కమలాకర్ ఆయనను మర్యాదపూర్వకంగా పువ్వుల మాలతో శాలువా తో సన్మానం చేసి డా… బిర్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని బహుమతిగా అందజేసారు. నూతన బాధ్యతలు స్వికరించిన సిఐ కి శుభాకాంక్షలు తెలియజేస్తు. మద్దూరి శేఖర్ మాట్లాడుతు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో కృషి చేయాలని, ముఖ్యంగా యువత విషయంలో ప్రత్యేక ద్రుష్టి పెట్టాలని శంకర్ పల్లి మండల్ లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా బాధ్యతయుతంగా విధులు నిర్వహించాలని కోరారు. ఈ సందర్బంగా సిఐ మీర్ ముదస్సుర్ అలీ మాట్లాడుతు శంకర్ పల్లి మండలంలో శాంతి భద్రతలను కాపాడేందుకు కట్టుబడి పని చేస్తానని తెలిపారు. ప్రజలకు న్యాయం జరిగేలా పోలీస్ వ్యవస్థ పరదర్శకంగా పని చేస్తుందని అన్నారు.