prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 7:46 pm Digital Edition : PRAJA KSHETRAM

శంకర్ పల్లి లో పెట్రోల్ కొరత బంకుల వద్ద వాహనదారుల రద్దీ!

శంకర్ పల్లి లో పెట్రోల్ కొరత బంకుల వద్ద వాహనదారుల రద్దీ!

శంకర్ పల్లి మార్చి 24(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని పెట్రోల్ బంక్ ల వద్ద పెట్రోల్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. పెట్రోల్ కోసం వాహనదారులు భారీగా బారులు తీరడంతో బంక్ పరిసరాల్లో పొడవైన క్యూలు కనిపిస్తున్నాయి. శంకర్ పల్లి మరియు సమీప ప్రాంతాల్లో పలుచోట్ల పెట్రోల్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకంగా ఉద్యోగస్తులు రేపటికి పెట్రోల్ దొరకకపోతే ఎలా అనే ఆందోళనతో గంటల తరబడి క్యూలలో నిలబడుతున్నారు. కొన్ని పెట్రోల్ బంకులు స్టాక్ లేక మూసివేయబడటంతో, అందుబాటులో ఉన్న బంకుల వద్ద రద్దీ మరింత పెరిగింది. “సరఫరా ఆలస్యమే ఈ సమస్యకు ప్రధాన కారణమని పెట్రోల్ బంక్ నిర్వాహకులు తెలిపారు. డిమాండ్ కు సరిపడా స్టాక్ చేరకపోవడంతో తాత్కాలిక కొరత ఏర్పడిందని వారు వెల్లడించారు.” ఇక కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి లోటు లేదని చెబుతున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపిస్తోంది. సరఫరా ఆలస్యమే ఈ సమస్యకు ప్రధాన కారణమని పెట్రోల్ బంక్ నిర్వాహకులు తెలిపారు. డిమాండ్ కు సరిపడా స్టాక్ చేరకపోవడంతో తాత్కాలిక కొరత ఏర్పడిందని వారు వెల్లడించారు. ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకుని సరఫరా వ్యవస్థను సక్రమంగా నిర్వహించాలని వాహనదారులు కోరుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.