శంకర్ పల్లి లో పెట్రోల్ కొరత బంకుల వద్ద వాహనదారుల రద్దీ!
శంకర్ పల్లి లో పెట్రోల్ కొరత బంకుల వద్ద వాహనదారుల రద్దీ! శంకర్ పల్లి మార్చి 24(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని పెట్రోల్ బంక్ ల వద్ద పెట్రోల్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. పెట్రోల్ కోసం వాహనదారులు భారీగా బారులు తీరడంతో బంక్ పరిసరాల్లో పొడవైన క్యూలు కనిపిస్తున్నాయి. శంకర్ పల్లి మరియు సమీప ప్రాంతాల్లో పలుచోట్ల పెట్రోల్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకంగా ఉద్యోగస్తులు రేపటికి పెట్రోల్ దొరకకపోతే ఎలా అనే ఆందోళనతో గంటల తరబడి క్యూలలో నిలబడుతున్నారు....