prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 27 March 2026, 5:11 pm Digital Edition : PRAJA KSHETRAM

శ్రీరామనవమి సీతారాముల వారి కళ్యాణోత్సవంలో పాల్గొన్న మాజీ జడ్పీ చైర్మన్ ఎం. బి. కుమార్ రాజా

శ్రీరామనవమి సీతారాముల వారి కళ్యాణోత్సవంలో పాల్గొన్న మాజీ జడ్పీ చైర్మన్ ఎం. బి. కుమార్ రాజా

బంగారుపాలెం, మార్చి 27(ప్రజాక్షేత్రం):చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండల పరిధిలోని రాములవారి గుడి వీధి నందు నూతనంగా ఏర్పాటు చేసిన రాముల వారి ఆలయానికి శుక్రవారం ముఖ్యఅతిథిగా మాజీ జడ్పీ చైర్మన్ ఎం.బి. కుమార్ రాజా పాల్గొన్నారు. శ్రీరాముల వారి ఆలయానికి చుట్టుపక్కల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు పైగా భక్తులు తమ మొక్కుబడులను తీర్చుకొని సీతారాముల వారి ఆలయంలో ప్రదక్షిణలు చేసి మ్రొక్కుబడులను తీర్చుకున్నారు. తదుపరి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద కార్యక్రమాలు పంచిపెట్టారు. మహిళలు ఆలయానికి భక్తిశ్రద్ధలతో విచ్చేసి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయానికి విరాళ దాతలు సీతారాముల వారి భక్తితో అధిక మొత్తంలో అందజేశారు.ఈ కార్యక్రమానికి మాజీ జడ్పీ చైర్మన్ ఎంబి కుమార్ రాజా, స్థానిక సర్పంచ్ ఎంబి ఉమాదేవి కృష్ణమూర్తి, ఉప సర్పంచ్ ఆర్. కామరాజు, జయసింహులు నాయుడు, మాధవ నాయుడు, శంకర, దొరబాబు, కో-ఆపరేటివ్ బ్యాంక్ మాజీ మండల అధ్యక్షులు దత్తాత్రేయ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, ఆలయ ధర్మకర్త రామయ్య, చాణిక్య, బాలాజీ,ప్రకాష్, స్థానిక యువత సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.