శ్రీరాముని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి
- ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్
రాజేంద్రనగర్, మార్చి 27(ప్రజాక్షేత్రం):శ్రీరాముని ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ ఆకాంక్షించారు. శుక్రవారం శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శంషాబాద్ మున్సిపల్ చిన్న గోల్కొండ, సిద్ధాంతి, ఆర్ బి నగర్, శాతంరాయి, మైలార్దేవపల్లి లోని దుర్గామాత గుడి, కాటేడాన్ వద్ద గల హనుమాన్ టెంపుల్ లో జరిగిన శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలకు హాజరై వేద పండితుల మంత్రాచరణలతో శ్రీరామ నామస్మరణతో ప్రత్యేక పూజల లలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని అన్నారు . శ్రీరాముని అనుగ్రహం ఆశీస్సులు ప్రజలపై , పాడిపంటలతో, అష్టఐశ్వర్యాలతో, సుఖ శాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆకాంక్షించారు. ప్రత్యేకమైన శ్రీరామనవమి రోజున ఆ శ్రీరాముని అనుగ్రహంతో మీ జీవితంలో కొత్త వెలుగు నిండాలని ఆయన పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సు కోసం ప్రతీ ఒక్కరూ ఆదర్శ ప్రాయంగా నిలవాలని కోరుతూ ప్రజలందరికి శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా కాలనీలకు చెందిన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.