సీసీ రోడ్డు నిర్మాణ పనులను పర్యవేక్షించిన
-కౌన్సిలరు మాదాసి రవి
నర్సంపేట మర్చి 27(ప్రజాక్షేత్రం):నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డు సిసి రోడ్ల నిర్మాణం అభివృద్ధి పనులకు సహకరించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో నేడు జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను పర్యవేక్షించిన అని స్థానిక కౌన్సిలరు మాదాసి రవి అన్నారు వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో 30వ వార్డు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు, దానికి ఉదాహరణే వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులన్నారు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కి 30వ వార్డు ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపెల్లి సందీప్, వార్డు నాయకులు, వార్డు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు..