స్తంభించిన జల రవాణా మార్గాలు
స్తంభించిన జల రవాణా మార్గాలు పెరిగిపోనున్న వంటగ్యాస్ ధరలు! వికారాబాద్ బ్యూరో మార్చి 06(ప్రజాక్షేత్రం):గల్ఫ్‌లో ముదురుతున్న అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ సంగ్రామం భారత్‌పై తీవ్ర ప్రభావం చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రవాసీయులు, పర్యాటకులకే పరిమితమైన ప్రభావం ఇప్పుడు.. భారతీయ పంటపొలాలకు, వంటగదులకూ విస్తరించేట్లుగా ఉంది. మన దేశ రైతులు ఉపయోగించే ఎరువుల్లో నాఫ్తా, డీఏపీ ముఖ్యమైనవి. నాఫ్తా ప్రధానంగా ఖతర్ నుంచి దిగుమతి అవుతోంది. యుద్ధం కారణంగా నాఫ్తాను సరఫరా చేయలేమని ఖతర్ బుధవారం రాత్రి చేతులెత్తేసింది. యూరియా, డీఏపీ ఉత్పత్తికి వాడే...