హోలీ మేరీ కళాశాలలో సిల్వర్ జూబ్లీ సంబరాలు
హోలీ మేరీ కళాశాలలో సిల్వర్ జూబ్లీ సంబరాలు కీసర, మార్చి 27(ప్రజాక్షేత్రం):మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం బోగారం లోని హోలీ మేరీ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జేఎన్టీయూ రిజిస్ట్రార్ డా.కే.వెంకటేశ్వర రావు ముఖ్య అతిథిగా, మురళి బుక్కపట్నం విశిష్ట అతిథిగా హాజరయ్యారు. రిటైర్డ్ అదనపు డీజీపీ డా.కే.బాబురావు, రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కళాశాల ప్రెసిడెంట్ వరప్రసాద్ రెడ్డి, సెక్రటరీ శారదారెడ్డి, చైర్మన్ సిద్ధార్థరెడ్డి తదితరులు జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారు....