prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 11 March 2026, 4:12 pm Digital Edition : PRAJA KSHETRAM

14 వ వార్డులో అక్రమ కట్టడాలను అన్నింటిని తొలగించండి కమిషనర్ గారు

14 వ వార్డులో అక్రమ కట్టడాలను అన్నింటిని తొలగించండి కమిషనర్ గారు

– బిజెపి మండల పార్టీ అధ్యక్షురాలు గండేటి గాయత్రి గౌడ్

– అక్రమ కట్టడాలకు ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులు

అక్రమంగా నిర్మించిన అన్నింటిని తొలగించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్

శంకర్‌పల్లి మార్చి 11(ప్రజాక్షేత్రం):శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని 14వ వార్డు శ్రీరామ్ నగర్ కాలనీలో రోడ్డుపై అక్రమంగా కొందరు కట్టడాలు నిర్మించారని బిజెపి మండల మహిళా అధ్యక్షురాలు గండేటి గాయత్రి గౌడ్ ఆరోపించారు. కాలనీ వెంచర్ 11 ఎకరాల లే అవుట్ ప్రకారం 60 అడుగుల సీసీ రోడ్డుపై కొందరు గృహ యజమానులు మెట్లు, కార్ పార్కింగ్ కొరకు రేకుల షెడ్లు, దుకాణాలకు డబ్బాలు, ఫుట్పాత్ కబ్జా చేసి జాలీలు నిర్మించడంతో రహదారి ఇరుకుగా మారిందని కాలనీవాసులు తెలిపారు. లక్ష రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను డ్రిల్లింగ్ యంత్రంతో నల్ల కలెక్షన్లు తీసుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి వారిపై మున్సిపల్ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇల్లు నిర్మించుకున్న వారు తమ వాహనాలకొరకు స్థలాలు కేటాయించకపోవడంతో రోడ్డుపైనే వారి వాహనాలు నిలిపివేస్తున్నారు. దీంతో వాహనాలు రాకపోకలకు ఇబ్బందులు కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాల్లో మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, కాలనీ వాసులందరికీ చట్టరీత్యా న్యాయం చేయాలని బిజెపి నేత గాయత్రి డిమాండ్ చేశారు.