పల్లెలే ప్రగతికి పట్టు గొమ్మలు
పల్లెలే ప్రగతికి పట్టు గొమ్మలు నాటి మాట నేడు ఏది…? కనుమరుగవుతున్న పల్లె సంస్కృతి సాంప్రదాయం 20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలి భారత దేశ జనాభాలో ఎనబై శాతం వ్యవసాయ దారులే. వీరిలో వ్యవసాయదారులు, వ్యవసాయ సంబంధిత పనులలో పనిచేసే వారు ఉన్నారు. సాంప్రదాయ వ్యవసాయం రాను రాను యాంత్రీకరణం వైపు పరుగిడుతున్నది. కరువు ప్రాంతాల్లో వ్యవసాయం గిట్టు బాటు కాని వ్యవహారంగా తయారైనది. అటు వంటి ప్రాంతాలలో బక్క రైతులు వ్యవసాయం చేయలేక ఇతర వ్యాపకాలకు మళ్లుతున్నారు. పెద్ద రైతులు దైనందిన వ్యవసాయం...