ప్రజాక్షేత్రం ఎఫెక్ట్ స్పందించిన అధికారులు
– దోమల నివారణ చర్యలకు స్ప్రే పాగింగ్
రాజేంద్రనగర్, ఏప్రిల్ 02(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నార్సింగి సర్కిల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వట్టినాగులపల్లిలో దోమల బెడద తీవ్రత అని ‘ప్రజాక్షేత్రం’ ‘పత్రికలో ప్రచురించడంతో గ్రామంలో కొంత కాలంగా దోమల బెడద ఎక్కువ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దోమల నివారణకు తగిన చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు జిహెచ్ఎంసి మున్సిపల్ అధికారులకు విన్నవిస్తున్నారు. అయితే గురువారం నార్సింగి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు స్పందించడంతో ఈ నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా దోమల నివారణ చర్యలను చేపట్టారు. ఇందులో భాగంగా గ్రామస్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో దోమల నివారణ కోసం గ్రామంలోని అన్ని వీధుల్లో, ఇందిరమ్మ కాలనీలో మున్సిపల్ సిబ్బంది దోమల నివారణ మందును ఫాగింగ్ చేశారు. దోమల నివారణ చర్యలకు స్పందించిన అధికారులను గ్రామస్తులు అభినందించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.