prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 08 April 2026, 11:00 am Digital Edition : PRAJA KSHETRAM

ప్రజాక్షేత్రం ఎఫెక్ట్..బాచుపల్లిలో అక్రమాల కూల్చివేత

ప్రజాక్షేత్రం ఎఫెక్ట్..బాచుపల్లిలో అక్రమాల కూల్చివేత

  • 99 రోజుల కార్యక్రమంలో అధికారులు బిజీ…శీర్షికతో ప్రజాక్షేత్రం పత్రికలో కథనం
  • సీజ్ చేసిన షెటర్ల తొలగింపు..షెడ్డు కూల్చివేత

కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 08(ప్రజాక్షేత్రం):నిజాంపేట్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ విభాగం కఠిన చర్యలు ప్రారంభించింది. బాచుపల్లి సబ్‌స్టేషన్ సమీపంలో ఉన్న అక్రమ షెడ్డు, కమర్షియల్ నిర్మాణంపై ప్రజాక్షేత్రం దినపత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందిస్తూ నిజాంపేట్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ తక్షణమే రంగంలోకి దిగారు.
బుధవారం టౌన్ ప్లానింగ్ సిబ్బంది ప్రత్యక్షంగా ఘటనాస్థలానికి చేరుకొని అక్రమంగా నిర్మించిన షెడ్డు పూర్తిగా కూల్చివేశారు. పక్కనే ఉన్న కమర్షియల్ షెటర్లను గతంలోనే సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆ షెటర్లను ఇంటి యజమాని స్వచ్ఛందంగా తొలగించినట్లు సమాచారం. ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ ఏసీపీ మాట్లాడుతూ, “అక్రమ నిర్మాణాలు ఎవరు నిర్మించినా ఉపేక్షించేది లేదు. చట్టానికి విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తప్పవు” అని స్పష్టం చేశారు. ఈ కూల్చివేతల్లో టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు.