మహిళా రిజర్వేషన్‌లో బీసీ మహిళలకు న్యాయం జరగాలి”
మహిళా రిజర్వేషన్‌లో బీసీ మహిళలకు న్యాయం జరగాలి" “నారీ శక్తి వందన అధినియమంలో” సగంపైగా ఉన్న వర్గానికి చోటు ఎక్కడ? భారతదేశ జనాభాలో సగభాగం మహిళలే. ఆ మహిళల్లోనే సగంపైగా వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలున్నారు. కానీ, వీరికి చట్టసభల్లో న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించే ప్రయత్నం నేటికీ కూడా జరుగలేదు. నారీ శక్తి వందన అధినియమం మహిళా రిజర్వేషన్ బిల్లు చరిత్రాత్మకమైన చట్టంగా అందరూ కీర్తిస్తున్నారు. నిజమే, కానీ ఈ చట్టంలో బీసీ (వెనుకబడిన తరగతులు) మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు లేవనే వాస్తవాన్ని విస్మరించడం,...