కోదాడలో ఘోరం నడిరోడ్డుపై భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త!
కోదాడలో ఘోరం నడిరోడ్డుపై భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త! సూర్యాపేట జిల్లా మే 06(ప్రజాక్షేత్రం):కోదాడ పట్టణంలో బుధవారం పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. స్థానిక బస్టాండ్ సమీపంలో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి తన భార్యను కత్తితో కిరాతకంగా పొడిచి చంపాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన శిరీష, మణిదీప్ దంపతులు బుధవారం కోదాడకు వచ్చారు. బస్టాండ్ ముందు మాట్లాడుకుంటున్న క్రమంలో ఇద్దరి మధ్య ఒక్కసారిగా వాగ్వాదం చోటుచేసుకుంది....