చీకటిలో శంకర్‌పల్లి రహదారులు ప్రమాదాల పర్వం.. అధికారుల నిర్లక్ష్యం?

చీకటిలో శంకర్‌పల్లి రహదారులు ప్రమాదాల పర్వం.. అధికారుల నిర్లక్ష్యం? ప్రమాదాలకు బాటలు వేస్తున్న వీధి దీపాల లోపం శంకర్‌పల్లి, మే 03(ప్రజాక్షేత్రం):శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలో రాత్రి వేళ రహదారులు చీకటిలో మగ్గుతున్నాయి. ప్రధాన మార్గాలతో పాటు నాలుగు దిక్కులుగా వెళ్లే రోడ్లలో ఒకే దిశలో మాత్రమే వెలుతురు ఉండగా, మిగతా ప్రాంతాలు అంధకారంలోనే ఉండటం ప్రమాదాలకు దారితీస్తోంది. ద్విచక్ర వాహనాలు, కార్ల రాకపోకలు కష్టంగా మారాయి. ఎదురుగా వచ్చే వాహనాల హైబీమ్ లైట్లు డ్రైవర్లకు ఇబ్బందిగా మారి, ముందున్న దారి స్పష్టంగా కనిపించక ప్రమాదాల...