prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 23 May 2026, 6:29 pm Digital Edition : PRAJA KSHETRAM

చెట్టును ఢీకొన్న ఆటో ముగ్గురి పరిస్థితి విషమం

చెట్టును ఢీకొన్న ఆటో ముగ్గురి పరిస్థితి విషమం

బూర్గంపాడు మే 23(ప్రజాక్షేత్రం):మణుగూరు-భద్రాచలం ప్రధాన రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాళ్లకొమ్మూరు క్రషర్ మిల్లు సమీపంలో వేగంగా వెళ్తున్న ఒక ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, ప్రస్తుతం వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.