చెట్టును ఢీకొన్న ఆటో ముగ్గురి పరిస్థితి విషమం
చెట్టును ఢీకొన్న ఆటో ముగ్గురి పరిస్థితి విషమం బూర్గంపాడు మే 23(ప్రజాక్షేత్రం):మణుగూరు-భద్రాచలం ప్రధాన రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాళ్లకొమ్మూరు క్రషర్ మిల్లు సమీపంలో వేగంగా వెళ్తున్న ఒక ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, ప్రస్తుతం వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు....