జన్వాడ గ్రామంలో విషాదం… నీటి సంపులో పడి మూడేళ్ల చిన్నారి మృతి

జన్వాడ గ్రామంలో విషాదం… నీటి సంపులో పడి మూడేళ్ల చిన్నారి మృతి శంకర్‌పల్లి మే 10(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ వెళ్లిన మూడేళ్ల చిన్నారి ప్రియాన్షు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందింది. ఆదివారం ఉదయం 7:30 గంటల సమయంలో ఈ ఘటన జరగగా, కుటుంబ సభ్యులు చిన్నారి మృతదేహాన్ని వెలికి తీశారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.