prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 29 May 2026, 8:30 pm Digital Edition : PRAJA KSHETRAM

ట్రైన్ టాయిలెట్‌లో గిన్నెలు కడిగిన సిబ్బంది.. రంగంలోకి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ!

ట్రైన్ టాయిలెట్‌లో గిన్నెలు కడిగిన సిబ్బంది.. రంగంలోకి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ!

  • ముంబై-ఎర్నాకుళం దురంతో ఎక్స్‌ప్రెస్‌లో ఘటన
  • సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన వీడియో
  • ఐఆర్‌సీటీసీకి నోటీసులు జారీ చేసిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ
  • వివరణ ఇవ్వాలంటూ ఆహార భద్రతా సంస్థ ఆదేశం

ముంబై మే 29(ప్రజాక్షేత్రం):ముంబై నుంచి ఎర్నాకుళం వెళ్లే దురంతో ఎక్స్‌ప్రెస్ రైలులో అత్యంత జుగుప్సాకరమైన ఘటన వెలుగుచూసింది. రైలులోని ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ టాయిలెట్‌లో ఐఆర్‌సీటీసీ క్యాటరింగ్ సిబ్బంది ఒకరు ప్లేట్లు, స్పూన్లు, గిన్నెలను కడుగుతుండగా ఓ ప్రయాణికుడు వీడియో తీశాడు. టాయిలెట్ సీటుపై గిన్నెల బుట్టను ఉంచి మరీ వాటిని శుభ్రం చేస్తున్న ఆ సిబ్బందిని సదరు ప్రయాణికుడు నిలదీశాడు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉదంతంపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) తీవ్రంగా స్పందించింది. ఆహార నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకుగానూ ఐఆర్‌సీటీసీకి నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలతో తక్షణమే వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రయాణికుల ఆరోగ్యం, పరిశుభ్రతతో చెలగాటమాడే ఇలాంటి పనులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులను డిమాండ్ చేస్తూ నెటిజన్లు మండిపడుతున్నారు.