ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
– రైతు సంఘం జిల్లా నాయకులు శీర్కా శ్రీశైలం రెడ్డి
మండల కార్యదర్శి కందడి సత్తిరెడ్డి
వలిగొండ మే 06(ప్రజాక్షేత్రం)యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రైతు సంఘం జిల్లా నాయకులు శీర్క శ్రీశైలం రెడ్డి గారు మండల కార్యదర్శి కందడి సత్తిరెడ్డిలు డిమాండ్ చేశారు. ఈరోజు మండల పరిధిలోని పహిల్మాన్ పురం టేకుల సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించడం జరిగినది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండాదాన్యం కొనుగోలు చేస్తున్నాం అని చెప్తున్నప్పటికీ అనేక గ్రామాల్లో ధాన్యం కొనుగోలు నత్త నడక నడుస్తా ఉన్నాయి అన్నారు. మిల్లుల దగ్గర ధాన్యం దిగుమతి సరిగా జరుగుతలేదని అన్నారు దీని కారణంగా లారీలు సరిగా రావడం లేదని అన్నారు ప్రభుత్వం వెంటనే మిల్లుల దగ్గర లారీలను దిగుమతి చేయించి లారీల కొరతను నివారించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు బంధారపు ధనుంజయ్ చేకూరి నగేష్ రేపాక ముత్యాలు ఎలిమినేటి జక్కా నర్సిరెడ్డి బండారి స్వామి ఉంగురాల కిష్టయ్య పార్టీ వీరస్వామి రెడ్డి పల్లె లింగస్వామి గజ్జి పాండు పాటి వెంకటరెడ్డి జక్కా రాంచంద్రారెడ్డి పైళ్ల కొండాల్లరెడ్డి బొడ్డు నర్సమ్మ బండి ఐలమ్మ పల్లె పారిజాతగజ్జి బాలమణి ఆర్ వేంకటేశ్వరరెడ్డి దండెబోయిన శ్రీను గూడూరు సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.