prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 03 May 2026, 6:43 pm Digital Edition : PRAJA KSHETRAM

నన్ను డీజీపీగా చూడాలన్న కోరికే అమ్మను బతికించింది: సీవీ ఆనంద్ భావోద్వేగం.

నన్ను డీజీపీగా చూడాలన్న కోరికే అమ్మను బతికించింది: సీవీ ఆనంద్ భావోద్వేగం

హైదరాబాద్ మే 03(ప్రజాక్షేత్రం):తెలంగాణ నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్ తన తల్లిని ఉద్దేశించి భావోద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తన తల్లిని కలిసి ఆమె ఆశీస్సులు తీసుకున్న ఆయన, ఈ సందర్భంగా తన మనసులోని మాటలను పంచుకున్నారు. తన తల్లి గత నవంబర్ నుంచి జనవరి వరకు తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారని, ఆ సమయంలో ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండేదని గుర్తుచేసుకున్నారు. “ప్రస్తుతం అమ్మ ఆరోగ్యం మెరుగైంది, కానీ ఇంకా మంచానికే పరిమితమయ్యారు. తన కొడుకును ఈ రాష్ట్రానికి డీజీపీగా చూడాలన్న ఆమె బలమైన కోరికే, అనారోగ్యం నుంచి ఆమెను బయటపడేసిందని నేను బలంగా నమ్ముతున్నాను” అని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. డీజీపీగా తన నియామకం గురించి తెలిసి తన తల్లి ఎంతో ఆనందపడ్డారని, ఆమె సంతోషం చూసి తానూ ఉప్పొంగిపోయానని వివరించారు. కొద్ది రోజుల క్రితమే సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ బాస్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.