prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 27 May 2026, 6:17 pm Digital Edition : PRAJA KSHETRAM

మహిళను దారుణంగా హత్య చేసిన దుండగులు

మహిళను దారుణంగా హత్య చేసిన దుండగులు

చేవెళ్ల మే 27(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చేవెళ్ల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఎరుకలి మైసమ్మ (50) అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత క్రూరంగా హత్య చేశారు. ఈర్లపల్లి రెవెన్యూ పరిధిలో జరిగిన ఈ ఘటనలో మహిళ కాళ్లు నరికి, గొంతు కోసి హత్య చేసినట్లు సమాచారం. సమాచారం అందుకున్న చేవెళ్ల పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి మెడలో ఉన్న బంగారం, కాళ్లలో వెండి కడియాలు, చెవుల్లో ఉన్న ఆభరణాల కోసం హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు.