prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 8:03 pm Digital Edition : PRAJA KSHETRAM

మెదక్ జిల్లాలో అంగన్వాడీ టీచర్ అక్రమాల కలకలం

మెదక్ జిల్లాలో అంగన్వాడీ టీచర్ అక్రమాల కలకలం

మెదక్ జిల్లా ప్రతినిధి మే 05(ప్రజాక్షేత్రం):మెదక్ జిల్లా చిన్న గొట్టిముక్కుల గ్రామంలో అంగన్వాడీ టీచర్ విమల చిన్నారుల పౌష్టికాహారాన్ని కారులో అక్రమంగా తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకున్నారు. చిన్నారులకు అందించాల్సిన పౌష్టికాహారాన్ని అంగన్వాడీ టీచర్ అక్రమంగా తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకొని అధికారులకు అప్పగించారు. చిన్నారుల నోరు కొట్టి కోడిగుడ్లు బాలామృతం పౌష్టికాహారం అమ్ముకునేందుకు కారులో వాటిని అక్రమంగా తరలిస్తుండగా అంగన్వాడీ టీచర్ బాగోతాన్ని యువకులు బయటపెట్టారు. మెదక్ జిల్లా శివంపేట మండలంలోని చిన్న గొట్టిముక్కుల గ్రామంలో అంగన్వాడీ టీచర్ అంగన్వాడీ పిల్లలకు అందించాల్సిన పౌష్టికాహారాన్ని అక్రమంగా తరలిస్తుండగా గ్రామస్తులు మంగళవారం మధ్యాహ్నం పట్టుకున్నారు. పిల్లలకు పెట్టాలిసిన పోషకాహారమైన 5 గుడ్ల ట్రేలు బాల అమృతo 3 ప్యాకెట్లు మిల్క్ పాకెట్లు 8 ఆయిల్ 3 పాకెట్లు 5 కిలోల శనగపప్పు, తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకొని ఉన్నతాధికారులకు తెలిపారు. గత కొంతకాలంగా అంగన్వాడి టీచర్ విమల గ్రామంలోని చిన్నారులకు ఎలాంటి పౌష్టికాహారం పంపిణీ చేయలేదని ఈ సందర్భంగా గ్రామస్తులు తెలిపారు. ఇలాంటి అంగన్వాడి టీచర్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.. అంగన్వాడి టీచర్ విమల అక్రమంగా తరలిస్తున్న పిల్లల పౌష్టికారం అన్నిoటిని గ్రామపంచాయతీ భవనంలో ఉంచారు.