మొయినాబాద్ మార్గంలో.. ‘ముంజల’ జాతర!
మొయినాబాద్ మార్గంలో.. 'ముంజల' జాతర! హైవేపై తెల్లని 'మంచు' ముక్కలు నగరవాసుల మనసు దోస్తున్న 'ఐస్ ఆపిల్స్' ఎండకాలం స్పెషల్.. గీత కార్మికుల ఇంట కురుస్తున్న సిరుల జల్లు! మొయినాబాద్, మే 05(ప్రజాక్షేత్రం):మొయినాబాద్ రోడ్డు.. ఇప్పుడు ముంజల అడ్డా! మండుతున్న ఎండలకు విరుగుడుగా.. ప్రకృతి ప్రసాదించిన అమృతంలా.. తాటి ముంజలు సిద్ధమయ్యాయి. సిటీ శివార్లలోని ఈ జాతీయ రహదారి ఇప్పుడు అచ్చమైన తెలంగాణ పల్లెటూరి సంతను తలపిస్తోంది. రోడ్డుకు ఇరువైపులా బుట్టల నిండా 'తెల్లని ముత్యాల్లాంటి' ముంజలను చూస్తుంటే బాటసారుల నోరూరాల్సిందే! చల్లని ముంజ.....