prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 21 May 2026, 9:07 pm Digital Edition : PRAJA KSHETRAM

రాజీవ్ గాంధీ సేవలు భారతదేశానికి చిరస్మరణీయం

రాజీవ్ గాంధీ సేవలు భారతదేశానికి చిరస్మరణీయం

– పెద్దేముల్ మండల కేంద్రంలో ఘనంగా రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి వేడుకలు

– పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి. మహిపాల్ రెడ్డి

పెద్దేముల్, మే 21(ప్రజాక్షేత్రం):మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ సేవలు భారతదేశానికి చిరస్మరణీయమని పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి.మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు.గురువారం పెద్దేముల్ మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో రాజీవ్ గాంధీ 35వ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి.మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ…దేశానికి అతి చిన్న వయసులో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ భారతదేశ అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు.ముఖ్యంగా దేశంలో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలకు పునాది వేసి భారతదేశాన్ని ఆధునిక దిశగా నడిపించిన దూరదృష్టి గల నాయకుడిగా రాజీవ్ గాంధీ గుర్తింపు పొందారని అన్నారు. గ్రామీణాభివృద్ధి, యువత సాధికారత, సాంకేతిక రంగాల ప్రోత్సాహంలో రాజీవ్ గాంధీ చేసిన సేవలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవలో ముందుండాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్.ఎల్లా రెడ్డి మాట్లాడుతూ..
భారతదేశానికి అతి చిన్న వయస్సులో ప్రధాన మంత్రిగా భారతరత్న రాజీవ్ గాంధీ ఎనలేని సేవలను అందించారని అన్నారు.భారతదేశంలో ముడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను తీసుకొచ్చి,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వ్యవస్థను పరిచయం చేశారని అన్నారు.రాజీవ్ గాంధీ మరణించకపోతే దేశం మరింత అభివృద్ధి చెందేదని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు శోభమ్మ,కోట్ పల్లి మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ సాయిని నారాయణ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెండ్యాల ప్రవీణ్ కుమార్ గుప్తా,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జితేందర్ రెడ్డి,ఎర్ర బాలప్ప, కోహిర్ రవి శంకర్,డివై పెద్ద నర్సింహులు, పడగాళ్ల బుజ్జమ్మ,ఎండి.రియాజ్,లాల్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, జైపాల్ రెడ్డి, కుర్వ బాలు,చేట్లమీది రామప్ప,చందు, మదుసూధన్ రెడ్డి,ఇందూరు మహేష్,హర్షవర్ధన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, డాక్టర్ రమేష్ కుమార్, మైఫూజ్, మహమూద్,రాజు,ఆయా గ్రామాల సర్పంచులు నాగి రెడ్డి,నారాయణ గౌడ్,గుడిసె చంద్రకళ, అరుణ, అశోక్, విజయ్,ఇతర నాయకులు, గ్రామస్థులు,తదితరులు పాల్గొన్నారు.