రుక్మాపూర్ గ్రామ శివారులో 4 నక్సలైట్ల అరెస్ట్
- నలుగురు నక్సలైట్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- తెలంగాణ,మహారాష్ట్ర పోలీసుల జాయింట్ ఆపరేషన్ సక్సెస్
- మహరాష్ట్ర పోలీసులకు 4 నక్సలైట్ల అప్పగింత
- తాండూరు రైల్వే పోలీస్టేషన్ పరిధిలో రుక్మాపూర్ గ్రామ శివారులో ఘటన
పెద్దేముల్, మే 10(ప్రజాక్షేత్రం):రుక్మాపూర్ గ్రామ శివారులో సాధారణ కూలీలుగా పనిలో చేరిన నలుగురు నక్సలైట్లను తెలంగాణ,మహారాష్ట్ర పోలీసులు సంయుక్తంగా స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి అరెస్ట్ చేసిన సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి….వికారాబాద్ జిల్లా తాండూరు రైల్వే పోలీస్టేషన్ పరిధిలోని రుక్మాపూర్ గ్రామ శివారులో రైల్వే పనుల కొనసాగుతున్నాయి.అయితే మహారాష్ట్ర చత్తీస్గడ్ చెందిన ముగ్గురు వ్యక్తులతో పాటు ఒక లేడీ నక్సలైట్‌పై అక్కడ కేసు నడుస్తోంది.అయితే ఈ నలుగురు నక్సలైట్స్ తాండూరు రైల్వే పోలీస్టేషన్ పరిధి రుక్మాపూర్ రైల్వే స్టేషన్‌లో పరిధిలో ఇటీవల కూలీ పనులకు కుదిరారు.గత 10 రోజులుగా వారు ఇక్కడే పనులు చేస్తున్నారు.పోలీసుల దర్యాప్తులో భాగంగా మహారాష్ట్ర పోలీసులు, తాండూరు పోలీసుల సహాయంతో అపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారు జామున రుక్మాపూర్ రైల్వే హెడ్ క్వార్టర్‌లో దాడులు నిర్వహించారు. నలుగురు నక్సలైట్లను అదుపులోకి తీసుకొని మహారాష్ట్రకు తరలించారు.