రైతుల గోసలు ఎన్నడు తీరేనో
తెలంగాణ క్రాంతిదళ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పృథ్వీరాజ్
వలిగొండ మే 23(ప్రజాక్షేత్రం):భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని ఎదుల్లగూడెం ఆర్రూరు మరియు వేములకొండ గ్రామాల ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రత్యక్షంగా సందర్శించి రైతులు వారు పడుతున్న బాధలు వారితో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పృథ్విరాజ్ మాట్లాడుతూ నెత్తి పైన గడ్డిమోపులు జేబులో వడ్లగింజలు మరియు కళ్ళం నిండా గింజలు ఉన్న రైతన్న నీ పళ్ళెం నిండా మెతుకు లేదో రైతన్న అనే సాహిత్యం ఇప్పటికీ ఉందని రైతులు తమ పంటను అమ్ముకోవడానికి అరిగోసలు పడుతున్నారని సకాలంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడం వలన రైతులు అప్పుల పాలు అవుతున్నారని మరియు తరుగు పేరుతో రైతులను క్వింటాలుకు 4 ,5 కిలోలు దోచుకుంటున్న ప్రభుత్వం చోద్యం చూస్తోందని రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయలేని ఈ చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఒకవేళ ఒక వారం రోజుల లోపల రైతుల పూర్తి ధాన్యం యుద్ద ప్రాతిపదికన ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని లేకుంటే పెద్ద ఎత్తున్న రైతులను సమీకరించి ప్రభుత్వం ను స్తంభింప చేస్తామని హెచ్చరించారు
ఇట్టి కార్యక్రమం లో దాసరి శ్రీనివాస్ సనత్ జయ సూర్య ఇన్జమూరి రాము జక్కల మత్స్యగిరి కొత్త నరసింహ దుర్గం శంకర్ మనోహర్ కూకుట్ల లింగస్వామి .వెంకట్ రెడ్డి గజ్జి ఐలయ్య ప్రశాంత్. పోలేబోయిన మమత లింగస్వామి శ్రీనాథ్ చెగురి వంశీరాజ్. సారగండ్ల మాచగిరి
పెద్ద ఎత్తున పలు గ్రామాల రైతులు రైతు కూలీలు పాల్గొన్నారు.