లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన సర్వేయర్
లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన సర్వేయర్ మహబూబ్‌నగర్ మే 26(ప్రజాక్షేత్రం):భూములకు సంబంధించి ఒక రైతుకు అనుకూలంగా సర్వే చేయడానికి లంచం డిమాండ్ చేసిన గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల సర్వేయర్ బ్రహ్మయ్య మంగళవారం ఎసిబి అధికారుల దాడిలో పట్టుబడ్డారు. మండలంలోని ఒక రైతుకు సంబంధించిన మొత్తం నాలుగెకరాల పొలాన్ని సర్వే చేయడానికి ఎకరానికి రూ.5 వేల చొప్పున మొత్తం రూ.20 వేలు ఇవ్వాలని సర్వేయర్ బ్రహ్మయ్య సదరు రైతుపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఇందులో భాగంగా రైతు నుంచి గతంలోనే అడ్వాన్స్‌గా రూ.5 వేలు...