సమ్మయ్యను పరామర్శించిన మంద కృష్ణ మాదిగ
సమ్మయ్యను పరామర్శించిన మంద కృష్ణ మాదిగ మంచిర్యాల మే 04(ప్రజాక్షేత్రం):ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నీల్వాయి సర్పంచ్, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చెన్నూరి సమ్మయ్యను ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సమ్మయ్య ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని వైద్యు లు తెలిపారు. ఆయనతో పాటు ప్రవీణ్, శ్యామ్ తదితరులు ఉన్నారు.