హైదరాబాదులో డ్రంక్ అండ్ డ్రైవ్… 700 మందికి పైగా దొరికారు!

హైదరాబాద్, మే 03(ప్రజాక్షేత్రం):సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వారాంతంలో నిర్వహించిన స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భారీ సంఖ్యలో మందుబాబులు పట్టుబడ్డారు. రెండు కమిషనరేట్లలో కలిపి మొత్తం 728 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మే 1, 2 తేదీల్లో నిర్వహించిన తనిఖీల్లో 445 మందిని పట్టుకున్నారు. వీరిలో 371 మంది ద్విచక్ర వాహనదారులు, 26 మంది త్రీవీలర్ వాహనదారులు, 48 మంది కార్లు, ఇతర వాహనాల డ్రైవర్లు ఉన్నారు. పట్టుబడిన వారి బ్లడ్...