అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రవేశాలు
చేవెళ్ల, జూన్ 22(ప్రజాక్షేత్రం):డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేవెళ్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల కో-ఆర్డినేటర్ కె. సూర్యనారాయణ తెలిపారు. బి.ఏ., బి.కాం., బి.ఎస్‌సి. కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు, సమాన అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అలాగే డిగ్రీ రెండవ, మూడవ సంవత్సరం విద్యార్థులు తమ ట్యూషన్ ఫీజులు చెల్లించుకోవచ్చని తెలిపారు. చేవెళ్లతో పాటు పరిసర ప్రాంతాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 9908640914 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.