అడవి పూల తలంబ్రాలు.. ఉపాధి హామీ పనుల్లో వృద్ధ జంట పెళ్లి సందడి!

అడవి పూల తలంబ్రాలు.. ఉపాధి హామీ పనుల్లో వృద్ధ జంట పెళ్లి సందడి! మెదక్ జిల్లా ప్రతినిధి జూన్ 04(ప్రజాక్షేత్రం):మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని నత్నాయిపల్లి గ్రామంలో ఓ విచిత్రమైన, హృద్యమైన సంఘటన చోటుచేసుకుంది. ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న ఓ వృద్ధ జంట, పనివేళలోనే పెళ్లి వేడుకలను తలపించేలా సందడి చేయడం అందరినీ ఆకట్టుకుంది. అడవిలో దొరికిన పూలు, పచ్చటి ఆకులను అక్షింతలుగా మార్చుకుని ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు. వృద్ధాప్యంలోనూ ప్రేమకు వయసు అడ్డుకాదని ఈ దంపతులు నిరూపించారు....