prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 1:42 pm Digital Edition : PRAJA KSHETRAM

అమీర్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం..

అమీర్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం..

 

హైదరాబాద్ జూన్ 04(ప్రజాక్షేత్రం):అమీర్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం(జూన్ 4) మధ్యాహ్నం అమీర్ పేట్ లోని కెఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. భారీగా ఎగిసి పడుతూ.. పక్కనే ఉన్న దుకాణాలకు కూడా మంటలు వ్యాపించాయి. మంటలతోపాటు దట్టంగా పొగ కమ్ముకోవడంతో స్థానిక వ్యాపారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైరింజన్లతో సాయంతో మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. మైత్రివనం సమీపంలో ప్రధాన రహదారిపై ఉన్న భవనంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.