ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌కు భద్రత కొనసాగించాలి: మంద కృష్ణ మాదిగ

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌కు భద్రత కొనసాగించాలి: మంద కృష్ణ మాదిగ హైదరాబాద్, జూన్ 29(ప్రజాక్షేత్రం):మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు కల్పించిన భద్రతను తగ్గించే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి, హోంమంత్రి రేవంత్‌రెడ్డికి సోమవారం బహిరంగ లేఖ రాశారు. డా. ప్రవీణ్‌కుమార్‌కు ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసులు లేకుండానే భద్రతను ఉపసంహరించుకుంటున్నట్లు, బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని తిరిగి అప్పగించాలని పోలీసు అధికారులు...