ఆసరాగా ఉంటామని నమ్మించి వృద్ధ తండ్రి భూమి కబ్జా!

ఆసరాగా ఉంటామని నమ్మించి వృద్ధ తండ్రి భూమి కబ్జా! సూర్యాపేట జూన్ 29(ప్రజాక్షేత్రం):సూర్యాపేట జిల్లాలో కలియుగ కూతుర్ల ఘాతుకం వెలుగుచూసింది. నిరక్షరాస్యుడైన వృద్ధ తండ్రిని మభ్యపెట్టి ముగ్గురు కూతుర్లు వ్యవసాయ భూమిని తమ పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటామని నమ్మించి మోసం చేశారని బాధితుడు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే ఆత్మకూర్ (ఎస్) మండలం మిడతనపల్లి గ్రామానికి చెందిన ఏనిగ ఎల్లారెడ్డికి లింగంపల్లి రెవెన్యూ శివారులోని సర్వే నెంబర్ 171లో వ్యవసాయ భూమి...