ఏసీబీ వలలో సైదాపూర్ మండల సర్వేయర్
ఏసీబీ వలలో సైదాపూర్ మండల సర్వేయర్ రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సర్వేయర్ కరీంనగర్, జూన్ 05(ప్రజాక్షేత్రం):భూ సర్వే నిర్వహించేందుకు లంచం డిమాండ్ చేసిన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల సర్వేయర్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో అతనికి సహకరించిన ఇద్దరు ప్రైవేట్ సహాయకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ తెలిపిన వివరాల ప్రకారం.. సైదాపూర్ మండలం అమ్మన్‌గుర్తి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భూమికి సర్వే నిర్వహించేందుకు మండల సర్వేయర్ యెక్కలదేవి కుమారస్వామి రూ.25...