కాడెద్దులా మారిన కన్నతల్లి..

కాడెద్దులా మారిన కన్నతల్లి.. భుజంపై నాగలి మోస్తూ సాగు చేస్తున్న మహిళా రైతు… కంటతడి పెట్టిస్తున్న రైతు కష్టం! మహారాష్ట్ర జూన్ 11(ప్రజాక్షేత్రం):ఆకలి తీర్చే అన్నదాత బతుకుచిత్రమిది. గుండెలు పిండేసే కన్నీటి గాథ ఇది. రెక్కాడితే గాని డొక్కాడని ఆ పేద రైతు కుటుంబానికి ప్రకృతి కూడా కరుణించలేదు. ఉన్న ఒక్క ఎద్దు పిడుగుపాటుకు చనిపోవడంతో, సాగు ఆగిపోతే ఆకలితో అలమటించాల్సి వస్తుందని.. ఆ తల్లి తానే కాడెద్దుగా మారింది. భుజంపై నాగలి మోస్తూ, కన్నీళ్లను దిగమింగుతూ భర్తతో కలిసి పొలం దున్నుతున్న దృశ్యం...