కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తడట..?
- పవన్ కళ్యాణ్‌పై ఫైర్ అయిన మంత్రి పొన్నం.
హైదరాబాద్ జూన్ 01(ప్రజాక్షేత్రం):ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినిమా నటుడు పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో నవ నిర్మాణ సభ పెడుతామన్న పవన్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ఘాటుగా స్పందించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి.. ఇక్కడికి వచ్చి నవ నిర్మాణ సభ పెడితే ఇక్కడ ఎవడు సహించడానికి సిద్ధంగా లేరన్నారు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినని వెధవ వచ్చి.. ఇక్కడ తెలంగాణ పట్ల మొసలి కన్నీరు కారిస్తే ఒప్పుకోమన్నారు. సినిమాల్లో జోకర్, విలన్, రౌడీ ఏ పాత్రలో నటించిన అది ఆయన వ్యక్తిగతమని అంతేకానీ, బీజేపీతో కలిసి తెలంగాణలో మతాల మధ్య చిచ్చుపెడుతామంటే చూస్తూ ఊరుకోమన్నారు. పవన్ కళ్యాణ్ పైసలు ఇస్తే ఎలాంటి నటన అయినా చేస్తాడు. ఏ డ్రెస్ అంటే ఆ డ్రెస్ వేసుకొని ఎగురుతాడని ఎద్దేవా చేశారు. నవ నిర్మాణ సభ గుజరాత్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఎందుకు పెట్టడం లేదని సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి వారి నాటకాలను తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదన్నారు.