చిర్యాల భూవివాదం కేసులో మరో 14 మంది అరెస్ట్

చిర్యాల భూవివాదం కేసులో మరో 14 మంది అరెస్ట్ సర్వే నం.156 భూమి వివాదం నేపథ్యంలో దాడి కీసర, జూన్ 13(ప్రజాక్షేత్రం):మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మండలం చిర్యాల గ్రామంలో చోటుచేసుకున్న భూవివాదానికి సంబంధించిన హత్యాయత్నం కేసులో మరో 14 మంది నిందితులను కీసర పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితులు పల్లె భద్రరెడ్డి, బొల్లంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పంజా సంజయ్‌కుమార్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. చిర్యాల గ్రామంలోని సర్వే నంబర్ 156లో...