జన్వాడ దంపతుల ఆత్మహత్య కేసులో ముగ్గురికి రిమాండ్

జన్వాడ దంపతుల ఆత్మహత్య కేసులో ముగ్గురికి రిమాండ్ శంకర్ పల్లి జూన్ 29(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడలో ఇటీవల జరిగిన దంపతుల ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మృతుడు బాలసాయి సోదరుడు అరవింద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. ఫిర్యాదు ప్రకారం, మృతురాలు పద్మ తండ్రి చంద్రయ్య, తల్లి శాంతమ్మ, మరిది వెంకటేష్‌లు కలిసి జూలకల్ గ్రామంలోని తమ ఇంట్లో బంగారు నిధి ఉందని, దానిని వెలికితీయడానికి డబ్బులు అవసరమని నమ్మించి మృతుడు...