ట్రీ కటింగ్ పనులతో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత

ట్రీ కటింగ్ పనులతో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత పెద్దేముల్, జూన్ 20(ప్రజాక్షేత్రం):33 కేవీ పెద్దేముల్ ఫీడర్ పరిధిలో ట్రీ కటింగ్ పనులు చేపట్టనున్న నేపథ్యంలో రేపు (జూన్ 21) విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు తాండూరు డివిజన్ విద్యుత్ డీఈ శంకర్ నాయక్ తెలిపారు.పెద్దేముల్ సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాలకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు వెల్లడించారు.ఫీడర్‌కు సమీపంలో ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే నిర్వహణ పనులు చేపట్టనున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు....