నాగారం–దమ్మాయిగూడ రోడ్డుపై ప్రజల ఆగ్రహం
నాగారం–దమ్మాయిగూడ రోడ్డుపై ప్రజల ఆగ్రహం నాగారం, జూన్ 20(ప్రజాక్షేత్రం):చిన్నపాటి వర్షానికే నాగారం–దమ్మాయిగూడ ప్రధాన రోడ్డుపై భారీగా నీరు నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు చెరువును తలపించేలా మారడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కురిసిన ప్రతిసారీ ఇదే పరిస్థితి నెలకొంటోందని, శాశ్వత పరిష్కారం కోసం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో అభివృద్ధి హామీలు ఇచ్చిన నాయకులు ఇప్పుడు ప్రజల సమస్యలను విస్మరించారని విమర్శిస్తున్నారు. రోడ్డుపై నిలిచిన...