బస్సులో ప్రయాణించిన తమిళనాడు సీఎం విజయ్

బస్సులో ప్రయాణించిన తమిళనాడు సీఎం విజయ్ 300 కొత్త బస్సులను ప్రారంభించిన తమిళనాడు సీఎం విజయ్ స్వయంగా టికెట్ కొనుగోలు చేసి ప్రభుత్వ బస్సులో ప్రయాణించారు. ప్రజా రవాణాపై తనదైన ముద్ర వేశారు. తమిళనాడు జూన్ 25(ప్రజాక్షేత్రం):తమిళనాడు సీఎం, టీవీకే అధినేత క్రమంగా పరిపాలనలో తనదైన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసిన 300 డీజిల్, సీఎన్జీ బస్సులను చెన్నై సచివాలయంలో సీఎం విజయ్ జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర రవాణా సంస్థల ఆధునీకరణ, ప్రజా రవాణా బలోపేతంలో భాగంగా...