బెల్ట్ షాపులపై ఉక్కుపాదం.. ఆరు ఇళ్లకు కరెంట్ కట్
బెల్ట్ షాపులపై ఉక్కుపాదం.. ఆరు ఇళ్లకు కరెంట్ కట్ మద్యపాన రహిత గ్రామంగా నష్కల్.. బాండు రాస్తేనే విద్యుత్ పునరుద్ధరణ వరంగల్ జూన్ 29(ప్రజాక్షేత్రం):జనగామ జిల్లా చిల్పూర్ మండలం నష్కల్ గ్రామంలో మద్యపాన నియంత్రణకు గ్రామపంచాయతీ కఠిన చర్యలు చేపట్టింది. గ్రామంలో రహస్యంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న ఆరుగురి ఇళ్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తూ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామంలో మద్యపానాన్ని పూర్తిగా నిర్మూలించి, మద్యపాన రహిత గ్రామంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో గతంలో నిర్వహించిన గ్రామసభలో ఏకగ్రీవంగా...