భారీ వర్షానికి జలమయమైన శంకర్ పల్లి రహదారులు
భారీ వర్షానికి జలమయమైన శంకర్ పల్లి రహదారులు అక్రమ కట్టడాల వల్లే సమస్యలు పెరిగాయంటున్న ప్రజలు శంకర్ పల్లి, జూన్ 13(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మండలంలో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీగా చేరుకున్న వర్షపు నీరు, రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నెమ్మదించి కొంతసేపు స్తంభించిన పరిస్థితి నెలకొంది. వర్షపు నీటి కాలువలు ఆక్రమణలకు గురికావడం, అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ కట్టడాల కారణంగానే నీరు సక్రమంగా వెళ్లక...