మరో అవినీతి చేప… అనీశాకు పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి

మరో అవినీతి చేప… అనీశాకు పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి ఖమ్మం జిల్లా జూన్ 27(ప్రజాక్షేత్రం):ముదిగొండ మండలం భానాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి తమ్మిశెట్టి సురేష్ ఫిర్యాదుదారుడి నుంచి రూ.25,000 లంచండిమాండ్ చేసి తీసుకుంటుండగా ఖమ్మం అవినీతి నిరోధక శాఖ(అనీశా)కు రేంజ్ అధికారులు పట్టుకున్నారు. ఫిర్యాదుదారుడి ఇంటి స్థలంలో నిర్మిస్తున్న ఒక గది రేకుల షెడ్కు భవన అనుమతి ప్రక్రియ పూర్తి చేయడం, ఇంటి నంబర్ కేటాయించడం కోసం పంచాయతీ కార్యదర్శి లంచం కోరినట్లు అనీశా అధికారులు తెలిపారు. ముదిగొండ మండలంలోని రైతు వేదిక సమీపంలో...