మాతృత్వానికే మచ్చ.. ప్రియుడితో కలిసి పిల్లలపై చిత్రహింసలు
మాతృత్వానికే మచ్చ.. ప్రియుడితో కలిసి పిల్లలపై చిత్రహింసలు ఒంటినిండా కాలిన గాయాలతో ఇద్దరు చిన్నారులు.. తల్లి, ప్రియుడు అరెస్ట్ హైదరాబాద్, జూన్ 24(ప్రజాక్షేత్రం):మాతృత్వానికే మచ్చ తెచ్చేలా ఓ తల్లి తన ప్రియుడితో కలిసి కన్నబిడ్డలపై అమానుషంగా చిత్రహింసలకు పాల్పడిన ఘటన వెలుగుచూసింది. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులను రోజూ వేధిస్తూ, వారి శరీరాలపై వాతలు పెట్టి తీవ్ర గాయాలకు గురిచేయడం స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన పింకీదేవి, సుజీత్ దంపతులు మూడేళ్ల క్రితం ఉపాధి...